ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మనస్సంకల్పానికి ప్రతీక.. మానసాదేవి అమ్మవారు - durga devi navaratri celebrations news

సంపదైనా, జ్ఞాన సంపదైనా కొందరి దగ్గరే ఎందుకుంటుంది? అందరిలో లేని ప్రత్యేక లక్షణాలు వారికి ఏముంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం మానసాదేవి స్వరూపంలో ఆవిష్కృతమవుతుంది.

మనస్సంకల్పానికి ప్రతీక.. మానసాదేవి అమ్మవారు
మనస్సంకల్పానికి ప్రతీక.. మానసాదేవి అమ్మవారు

By

Published : Oct 18, 2020, 7:27 PM IST

మనసా, వాచా, కర్మణా.. అంటారు. ఏ మహత్కార్యాన్ని సాధించాలన్నా ముందు మానసికంగా బలంగా ఉండాలి. అలాంటి మనస్సంకల్పానికి ప్రతీక మానసాదేవి. సర్పజాతి నియమాలు, నియంత్రణ ఆమె లక్ష్యాలైనా జ్ఞానసాధన కోసం పట్టుదలతో అద్వితీయమైన కృషి చేసింది. ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. సర్పజాతికి అధిదేవతగా కశ్యప మహాముని ఈమెను సృష్టించాడని పురాణగాథ. తన జాతి సంరక్షణ ఆధ్యాత్మిక జ్ఞానంతోనే సాధించవచ్చని భావించిన ఆమె దానికోసం తీవ్రమైన తపస్సు చేసింది.

శివానుగ్రహం కోసం తన పదహారో ఏట మొదలుపెట్టి మూడున్నర యుగాల పాటు ఉగ్రతపాన్ని ఆచరించింది. యవ్వనప్రాయంలో స్వాభావికమైన అనేక కోరికలను నియంత్రించుకుని కఠిన నియమాలు ఆచరిస్తూ తపస్సు చేసింది. ఫలితంగా మృతసంజీవని విద్యను సాధించింది. సర్పజాతికి మాతృ సమానురాలైనా విష స్వభావాన్ని వదిలేసి ఎందరికో ప్రాణదానం చేసింది. పాల సముద్ర మథనంలో పుట్టిన హాలాహలంలో అర్ధభాగాన్ని శివునితో పాటు తానూ స్వీకరించి మొత్తం విశ్వానికి మేలు చేసింది, పట్టుదల, త్యాగాలతో జ్ఞానాన్ని, అమృతత్వాన్ని, దైవత్వాన్ని సాధించవచ్చని నిరూపించింది.

సర్ప దోషాల నివారణ కోసం, సంతానం కోసం ఆమెను పూజించాలని చెబుతారు. ఈమె పూజను మనఃపూర్వకంగా చేసిన వారికి సత్ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

ABOUT THE AUTHOR

...view details