వరికెపుడిశెల ఎత్తిపోతల పథకం పేరును వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టుగా మారుస్తూ.. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు కడప జిల్లాలోని గాలివీడు, రాయచోటి తదితర మండలాల్లోని చెరువులకు వెలిగల్లు రిజర్వాయర్ నుంచి 0.40 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ప్రభుత్వం పాలనానుమతి మంజూరు చేసింది. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.94 కోట్లు ఖర్చు చేసేందుకు గానూ పాలనానుమతులు మంజూరూ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక ఆ ప్రాజెక్టు పేరు.. వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు - godavari penna link project name change news
గోదావరి- పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు మొదటి దశ- వరికెపుడిశెల ఎత్తిపోతల పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి ఈ ప్రాజెక్టును వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టుగా వ్యవహరించాలని సూచిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Godavari penna link project name changed
TAGGED:
godavari penna projects news