వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియలో 550 జీవోను పారదర్శకంగా అమలు చేయాలని కోరుతూ విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సి.వి. రావుకు బీసీ సంఘ నేతలు వినతిపత్రం సమర్పించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే వర్శిటీ అధికారులు వైద్య విద్యార్థుల కౌన్సిలింగ్ ప్రక్రియలో 550జీవోను అమలు చేశారు. ఈ విషయాన్ని వర్శటీ వీసీ సి.వి. రావు బిసి సంఘ నేతలకు తెలిపారు. ఈ జీవో అమలు చేయక గతేడాది 600 మంది బీసీ విద్యార్థులకు నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామన్నారు. మరోవైపు ఈడబ్ల్యూయస్ కోటాలో సైతం బీసీలకు కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'వైద్య విద్య సీట్ల భర్తీలో 550 జీవోను అమలు చేయాలి' - 550 GO
వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియలో రాష్ట్రం 550 జీవోను అమలు చేయాలని బీసీ సంఘ నేతలు కోరారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతికి వినతిపత్రం అందించారు.
వైద్య విద్యా సీట్ల భర్తీలో 550 జీవోను అమలు చేయాలి