రాష్ట్ర అవసరాల దృష్ట్యా టీకాల కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్ పిలుస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ వెల్లడించారు. టీకాల కొనగోళ్లకు ఇతర రాష్ట్రాలూ గ్లోబల్ టెండర్‌కు వెళ్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జూన్ 3 వరకు బిడ్ల దాఖలుకు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు అనిల్ సింఘాల్ చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామన్న సింఘాల్... 25 శాతం అదనంగా వైద్య సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు సూచించినట్లు పేర్కొన్నారు.