చంపేశారు.. విజయవాడ చిన్నారి ద్వారక ఇక లేదు! చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల చిన్నారి హత్యోదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో... అలాంటి ఉదంతమే విజయవాడ నగర శివారులో వెలుగు చూసింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి ఆడుకునేందుకు బయటకు వెళ్లిన ఎనిమిదేళ్ల చిన్నారి... ఈ రోజు ఇంటి సమీపంలోని ఓ గోనె సంచెలో మృతదేహమై కనిపించింది. తమ నివాసానికి దగ్గరలోని ఇంట్లో ఉండే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భవానీపురం పోలీసు స్టేషను పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి సమీపంలోని నల్లకుంట ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల మువ్వా ద్వారక.. నిన్న సాయంత్రం అదృశ్యమైంది. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు... పాప కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెయింట్‌పాల్స్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ద్వారక రెండో తరగతి చదువుతుండగా... తండ్రి అనీల్ మద్యం గోదాములోను... తల్లి ఓ ప్రయివేటు పాఠశాలలోను పనిచేస్తున్నారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న భవానీపురం పోలీసులు ఉదయం నుంచి దర్యాప్తు చేపట్టారు. రెండు బృందాలుగా విభజించారు. విజయవాడలో విస్తృతంగా తనిఖీలు చేయించారు.
సీసీ కెమేరాల్లో దృశ్యాలు ఏమైనా రికార్డు అయ్యాయా? అనే విషయంపైనా పరిశీలన చేయించారు. డ్రోన్ కెమేరాతోనూ దృశ్యాలు నమోదు చేయించి పరిశీలించారు.
సోమవారం సాయంత్రం..ద్వారక ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న మేకల ప్రకాష్ నివాసంలోని ఓ గోనె సంచెలో బాలిక మృతదేహం బయటపడింది.మద్యం తాగిన ప్రకాష్ తన ఏటీఎం కార్డును ఇంట్లో విసిరేసిన సమయంలో..దాని కోసం అతని భార్య వెతకింది.ఆ సమయంలో గోనె సంచి కనిపించింది.అందులో బాలిక మృతదేహం చూసి..కేకలు వేస్తూ స్థానికులను పిలిచి స్పృహకోల్పోయింది.ఆ సమయంలో ప్రకాష్..ఇంట్లో లేడు. బయట తిరుగుతుండగా స్థానికులు అతన్ని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు.పోలీసులు ప్రకాష్‌ను స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.ప్రకాష్ ను చిన్నారి ద్వారకా పెదనాన్న అని పిలిచేది.
చంపేశారు.. విజయవాడ చిన్నారి ద్వారక ఇక లేదు! గోనె సంచెలో కాళ్లు,చేతులు కట్టేసి మృతదేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.బాలిక జడ చెదిరిపోయి,వస్త్రాలు సరిగా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రకాష్అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.మెడపై గాయం ఉండడం..తీగను మెడకు చుట్టి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.మృతదేహాన్ని పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి..శవపంచనామా కోసం తరలించారు.