ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. శనివారం మేయర్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ మేయర్ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యులకు నెగటివ్ వచ్చింది.

హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్
హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

By

Published : Jul 26, 2020, 5:37 PM IST

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్​కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. గతంలోనూ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకోగా.. నెగటివ్ వచ్చింది. గతంలో నగర పర్యటనలో భాగంగా ఓ టీ దుకాణంలో ఛాయ్ తాగారు. టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా పాజిటివ్ రావడం వల్ల మేయర్​ తొలిసారిగా పరీక్ష చేయించుకున్నారు. అప్పుడు నెగటివ్​ వచ్చింది. ఆయన కారు డ్రైవర్‌కు పాజిటివ్ రావడం వల్ల రెండోసారి పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడూ నెగటివే వచ్చింది.

కానీ మూడోసారి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్​గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ రిపోర్ట్​లో కరోనా పాజిటివ్​ రావడం వల్ల తాను స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. తనకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఐసొలేషన్ పూర్తి అయిన అనంతరం మరలా ఒకసారి టెస్ట్ చేయించుకుంటానని చెప్పారు. కరోనా నుంచి బయటపడిన తర్వాత ప్లాస్మా దానం చేస్తానని మేయర్ ప్రకటించారు. సెల్ఫ్ ఐసొలేషన్​లో ఉంటూనే జీహెచ్​ఎంసీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షిస్తున్నట్లు బొంతు రామ్మోహన్ వివరించారు. వర్షాకాలమైనందున సీజనల్ వ్యాధులు, దోమల వ్యాప్తిని నియంత్రించటంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజలకు మేయర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details