డిసెంబరు 4న.. గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించాలని అధికారులను (minister Avanti Srinivas on Ghantasala Jayanthi celebrations at visakha) పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదేశించారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. వేర్వేరు భాషల్లో 10 వేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు ఘంటసాల శతజయంతి వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఘంటసాల జయంతి వేడుకల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలోని తమ ఛాంబరులో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు.
నవంబరు 26న జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని(constitution day celebrations on November 26th) పురస్కరించుకొని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలివ్వాలన్నారు. మరోవైపు సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాల విశిష్ఠతను తెలియజెప్పేలా.. విశాఖ ఉత్సవం, కడపలో గండికోట ఉత్సవం, అనంతపురంలో లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని లేపాక్షి, కొండపల్లి, పెడన, శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రాంతాలను వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలుగా గుర్తించాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని అధికారులకు(minister Avanti Srinivas news) సూచించారు.