ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''తెదేపాను వీడడం''పై.. వల్లభనేని ఏమన్నారంటే? - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలసిన మాట వాస్తవమేనని... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డిని కలసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

By

Published : Jul 9, 2019, 9:08 PM IST

కిషన్ రెడ్డిని కలసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇచ్చారు. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని తాను కలిసింది నిజమేనని అంగీకరించారు. మర్యాదపూర్వకంగానే కలిసనట్టు వివరణ ఇచ్చారు. ఇటీవలే భాజపాలో చేరిన సుజనా చౌదరితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగుతున్నాయని తేల్చి చెప్పారు. అంత మాత్రాన తెదేపా నుంచి మారాల్సిన అవసరం తనకి లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. నిర్మాతగా ఎన్నో సినిమా కథలు తాను వింటే... ఇప్పుడు తనపై సెల్ ఫోన్ సాయంతో సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథలు అల్లటం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. గన్నవరం నియోజకవర్గంలో స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమం జరిగినందున వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకే తాను వెళ్లానన్నారు. తెదేపాతోనే తాను కొనసాగుతానని కుండబద్ధలు కొట్టారు.

ABOUT THE AUTHOR

...view details