Gazetted Employees meeting: పీఆర్సీ అంశాలపై గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అత్యవసర భేటీ - ap latest news
![Gazetted Employees meeting: పీఆర్సీ అంశాలపై గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అత్యవసర భేటీ Gazetted Employees Union Meeting on PRC Issues](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14159161-36-14159161-1641908146922.jpg)
18:03 January 11
పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ను పునఃసమీక్షించాలని గెజిటెడ్ ఉద్యోగుల డిమాండ్
Gazetted Employees meeting: పీఆర్సీకి సంబంధించిన అంశాలపై.. ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. పీఆర్సీ ఫిట్మెంట్ అంశాన్ని పునః సమీక్షించాలని.. ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న మధ్యంతర భృతి 27 శాతానికి తగ్గకుండా పీఆర్సీ ప్రకటించాలని.. ఆ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ప్రకటన జారీ చేశారు. ఇంటి అద్దె భత్యం స్లాబ్స్ ను ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం నగరాల్లో ఖర్చులు విపరీతంగా పెరిగటంతో.. సీసీఎను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అశుతోష్ మిశ్రా కమిషన్ చెప్పిన విధంగానే.. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేసింది. పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
CM Jagan: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్
TAGGED:
ap latest news