ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BAD ROADS: ఆ రహదారి నరకానికి నకళ్లు.. వాహనాలు నడిపేందుకు పాట్లు - రహదారుల అద్వానం

అవి రహదారులు కాదు.. నరకానికి నకళ్లు. వాటిపై వాహనం నడిపితే ఒళ్లు గుల్ల, బళ్లు డొల్ల అవడం ఖాయం. మామూలు రోజుల్లో దుమ్ము ధూళి, వర్షం పడితే బురదతో అక్కడివారు సావాసం చేయాల్సిందే..ఆ దారిలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా అధికారులు అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

BAD ROADS
BAD ROADS

By

Published : Nov 13, 2021, 10:43 PM IST

ఆ రహదారి నరకానికి నకలు.. వాహనాలు నడిపేందుకు పాట్లు

బురద, గుంతలు తప్ప రోడ్డు అసలు కనపడని ఈరోడ్డు ఏ మారమూల పల్లెలోనిదో కాదు. విజయవాడ నగర శివార్లలోని గన్నవరం నుంచి నూజివీడు వెళ్లే రహదారి. ఈ మార్గం మీదుగా బైకులు, కార్లతో పాటు భారీ వాహనాలను నిత్యం ప్రయాణిస్తుంటాయి. రోడ్డు అంతా గుంతలు తేలటంతో ఈ మార్గంలో ప్రయాణమంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గన్నవరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆగిరిపల్లికి వెళ్లాలంటే సాధారణంగా అరగంట సమయం పడుతుంది..కానీ ఈ గోతుల రహదారితో రెట్టింపు సమయం కన్నా ఎక్కువే పడుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గన్నవరం నుంచి వెళ్లే రహదారిలో క్వారీలు ఎక్కువ ఉండటం వల్ల... భారీ వాహనాలతో ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది నిధులు మంజూరు చేసినా.. ఇప్పటికీ పనులు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details