విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే విస్తరణకు గన్నవరం మండలం దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 50 ఎకరాల భూమిని సేకరించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ ప్యాకేజీని రద్దు చేసి 5 సెంట్ల స్థలానికి బదులు సెంటున్నర ఇస్తామని చెప్పడంతో బాధితులు ప్రభుత్వం సేకరించిన స్థలం వద్ద ఆందోళనకు దిగారు. 5 సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద సుమారు 300 కుటుంబాల నుంచి గత ప్రభుత్వం భూమిని సేకరించింది.
విమానాశ్రయం రన్ వే విస్తరణకు భూములిచ్చిన నిర్వాసితులు ఆందోళన - కృష్ణా జిల్లా వార్తలు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే విస్తరణకు భూమిలిచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ కింద గన్నవరం మండలంలోని దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో 50 ఎకరాల భూమిని సేకరించింది. నిర్వాసితులకు 5 సెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం ఆ ప్యాకేజీని రద్దు చేసి, సెంటున్నర స్థలాన్ని ఇస్తానని ప్రకటించింది. దీంతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు.
![విమానాశ్రయం రన్ వే విస్తరణకు భూములిచ్చిన నిర్వాసితులు ఆందోళన నిర్వాసితులు ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7857688-802-7857688-1593674639294.jpg)
నిర్వాసితులు ఆందోళన