విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం.. ద్విచక్రవాహనాలకు నిప్పు - విజయవాడలో బైకులకు నిప్పుపెట్టిన యువకులు
09:45 May 12
పోలీసులకు సమాచారం ఇస్తున్నారన్న అనుమానంతో స్థానికుల బైక్‌లకు నిప్పు
విజయవాడ టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి 5 ద్విచక్ర వాహనాలు తగలబెట్టారు. నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతిరోజూ లంబాడిపేట ప్రాంతంలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్ఙిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తున్నామనే అనుమానంతో.. ద్విచక్ర వాహనాలు తగులబెట్టి ఉంటారని స్థానికుల అనుమానం వ్యక్తం చేశారు. టూటౌన్ కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: