ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డేటింగ్​ యాప్​లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు - hyderabad news

హాయ్‌‌‌‌..హ్యాండ్సమ్‌‌‌‌’ అని ఎవరైనా అమ్మాయి అంటే ఆ కుర్రాడి పని అయిపోయినట్టే. ఇక డేటింగ్‌‌‌‌ అంటూ ఆఫర్‌‌‌‌ ఇస్తే ఆగుతారా? దేనికైనా రెడీ అవుతారు. ఈ బలహీనతనే ఆసరాగా తీసుకున్న కొంతమంది జేబులు ఖాళీ చేస్తున్నారు. అలా డేటింగ్​ యాప్​లతో యువతను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. డేటింగ్​ అప్లికేషన్లను ఎవరూ సంప్రందించొద్దని సూచిస్తున్నారు.

gang arrested for cheating with dating apps in hyderabad
తెలంగాణ:డేటింగ్​ యాప్​లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

By

Published : Nov 20, 2020, 6:25 PM IST

డేటింగ్ అప్లికేషన్లలో యువకులను ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబంగలోని సిలిగురికి చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి... నిందితుల నుంచి 32 చరవాణులు, 12ఏటీఎం కార్డులు, లాప్​టాప్ స్వాధీనం చేసుకున్నారు. సంతుదాసు అనే వ్యక్తి దాదాపు 35 కాల్ సెంటర్లను సిలిగురితో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశాడు. వీటిని తన ఏజెంట్లకు లీజుకు ఇచ్చాడు. పేరుకు కాల్ సెంటర్లే అయినా లోపల మాత్రం డేటింగ్ అప్లికేషన్ల ద్వారా యువకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేశాడు. పలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చి ఆకర్షించే విధంగా టెలీకాలర్లను నియమించుకున్నాడు. వెబ్ సైట్లను సంప్రదించే యువకులను టెలీకాలర్లతో ఫోన్ చేయించి.. ఆకర్షింపజేస్తాడు. ఆ తర్వాత పలు రుసుముల పేరుతో భారీగా డబ్బులు లాగుతారు.

తెలంగాణ:డేటింగ్​ యాప్​లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

ఇలా హైదరాబాద్​కు చెందిన వ్యక్తి నుంచి 14లక్షల రూపాయలు, షాద్​నగర్​కు చెందిన యువకుడి నుంచి లక్ష రూపాయలు వసూలు చేశాడు. బాధితులు మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐపీ అడ్రస్​ల ఆధారంగా పశ్చిమబంగలోని సిలిగురికి 20 రోజుల క్రితం వెళ్లారు. స్థానిక పోలీసుల సహకారంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సంతుదాస్ నేపాల్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నేపాల్ సరిహద్దులో ఉన్న సిలిగురిలో చాలామంది ఈ తరహా కాల్​ సెంటర్ల పేరుతో వ్యాపారం చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డేటింగ్ అప్లికేషన్లను సంప్రదించొద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరూ ఇతరులతో పంచుకోవద్దన్నారు. డేటింగ్ మోసాలపై 9490617444 నెంబర్​కు ఫిర్యాదు చేయొచ్చని సీపీ సజ్జనార్ వెల్లడించారు.

ఇవీ చూడండి:

18 నెలల పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా: రామ్మోహన్ నాయుడు

For All Latest Updates

TAGGED:

crime news

ABOUT THE AUTHOR

...view details