ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Gandhi jayanti: మహాత్ముని జీవితం.. ప్రపంచానికి ఆచరణీయం: గవర్నర్​ - మహాత్మా గాంధీ, భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి అర్పించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్

రాజ్​భవన్​లో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల(Gandhi and Lal Bahadur Shastri Jayanti celebrations at raj bhavan)ను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. ఇరువురు నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా జరుపుకోవడం భారతీయులుగా మనకు గర్వకారణమని గవర్నర్​ అన్నారు.

Gandhi and Lal Bahadur Shastri Jayanti celebrations at raj bhavan
రాజ్​భవన్​లో జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2021, 4:45 PM IST

అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి(Gandhi Jayanthi celebrations at raj bhavan) వేడుకలను రాజ్​భవన్​లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్.. ఇరువురు నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ 152వ జయంతి(Gandhi Jayanthi celebrations), లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి(Lal Bahadur Shastri Jayanti celebrations)ని జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. గాంధీ జయంతి(Gandhi Jayanti celebrations)ని ప్రపంచవ్యాప్తంగా "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా జరుపుకోవడం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు.

మహాత్మా గాంధీ(Gandhi Jayanthi celebrations).. సత్యం, న్యాయం పట్ల విశ్వాసంతో యావత్‌ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పటానికి గాంధీజీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. గాంధీజీ తన చివరి శ్వాస వరకు దేశంలో సామాజిక సమస్యల నిర్మూలనకు కృషి చేసారని.. అంటరానితనం నిర్మూలన, సమానత్వం, సామాజిక న్యాయం సాధన వంటి విషయాలలో అలుపెరగని పోరాటం చేసారని గవర్నర్ గుర్తు చేశారు.

'జై జవాన్ జై కిసాన్' అన్న లాల్ బహదూర్ శాస్త్రిజీ నినాదం.. మనందరి మనస్సులలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి( Lal Bahadur Shastri Jayanti celebrations) సామాన్యులతో అత్యంత సన్నిహితంగా మెలిగారని..ఆయన ప్రజా జీవితం దేశ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి బలమైన నాయకునిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పటికీ వినయంతో, మృదువుగా మాట్లాడేవారని గవర్నర్ అన్నారు.

పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారం

జయంతి వేడుకలలో భాగంగా గవర్నర్.. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. రాజ్ భవన్ ఆవరణలో తొలి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న మూడు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్​పి సిసోడియా, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏకే ఫరీడా, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు

ABOUT THE AUTHOR

...view details