ఓ వైపు కరోనా, మరోవైపు ప్రకృతి... మట్టి గణపతులకు డిమాండ్ చాలా పెరిగింది. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను కొనేందుకు తెలంగాణలోని హైదరాబాద్ వాసులు మొగ్గుచూపుతున్నారు. మట్టి గణపతులను పూజిద్దాం....ప్లాస్టర్ ఆఫ్ పారీస్ను వదిలేద్దాం. అనే నినాదం వచ్చేసింది. కొందరు యువకులు బీజ్ బప్పా పేరుతో ప్లాంట్ గణేష్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
మట్టి గణపతి... పర్యావరణ హితం - Ganapati Made of Clay
వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమయింది. ప్రకృతిలో మమేకమవుతూ నేల-నీరు, చెట్టు - పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం అంటున్నారు హైదరాబాద్ వాసులు.
ganapati-made-of-clay-in-hyderabad-city
మనం కూడా ఈ దఫా విత్తన గణపతినే కొలువుదీర్చుదాం. మనసారా పూజిద్దాం. చేతులారా నిమజ్జనం చేద్దాం. భగవంతుడి ప్రసాదంగా మొలిచే మొక్కను ప్రేమగా పెంచుకుందాం. అది సాధ్యం కాని పక్షంలో మట్టి గణపతినైనా మనసారా పూజిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వినాయక చవితి పండుగ అసలు లక్ష్యాన్ని నెరవేరుద్దాం.
ఇవి చూడిండి: ఖైరతాబాద్ ఉత్సవ సమితి చరిత్రలోనే కొత్త అధ్యాయం