Gadikota Srikanthreddy: శాసన సభలో తెదేపా సభ్యుల ప్రవర్తనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. పోలవరం,పేదల ఇళ్లనిర్మాణాలు సహా పలు అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించామని, నిజలు బయటకు వస్తాయనే భయాందోళనలతోనే తెదేపా సభ్యులు సభలో గందరగోళం సృష్టించారన్నారు. కేటాయింపుల్లో తెదేపా ప్రభుత్వానికి ,తమ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అవినీతి ,దళారులు లేకుండా నేరుగా పేదలకు పథకాలు అందిస్తున్నామన్నారు.
Gadikota Srikanthreddy: తెదేపా ఎమ్మెల్యేలకు గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ - Gadikota Srikanth Reddy latest news
Gadikota Srikanthreddy: హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం తప్పెలా అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో తెదేపా సభ్యుల ప్రవర్తన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆక్షేపించారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని.. సవాల్ చేశారు.
గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం తప్పెలా అవుతుందని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మూడు రాజధానులపై తమ పార్టీ సభ్యులను రాజీనామా చేయమని అడగటం కాదు..తెలుగుదేశం ఎమ్మెల్యేలే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని.. సవాల్ చేశారు. పాలన వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. తాము దానికే కట్టుబడి ఉన్నామన్నారు.
ఇదీ చదవండి: CAG REPORT :'2020-21లో బడ్జెట్లో చూపని ఆర్దిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి'