రాష్ట్రంలో ఉపాధి హామీ లబ్ధిదారులకు కూలీ చెల్లింపు కోసం రూ.375.31 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ నిధుల ద్వారా దాదాపు 60 లక్షల మంది కూలీల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుందని వెల్లడించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి : మంత్రి రామచంద్రారెడ్డి - rural employment guaranty act in andhrapradhesh
ఉపాధి హామీ కూలీల కోసం రూ.375.31కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వేసవికాలం, కరోనా వ్యాప్తి దృష్ట్యా కూలీల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు.
మంత్రి రామచంద్రారెడ్డి
వేసవికాలం, కరోనా వ్యాప్తి దృష్ట్యా.. కూలీల ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి రామచంద్రారెడ్డి ఆదేశించారు. కరవు పరిస్థితులు నెలకొన్న మండలాల్లో అర్హులైన ప్రతిఒక్కరికీ పని కల్పించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత లేదన్న మంత్రి... పనుల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి.