రాష్ట్ర సచివాలయంలో హౌస్ కీపింగ్ సేవలు సహా మరమ్మతులు, పార్కు అభివృద్ధి తదితర సేవలకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకీ చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్ కీపింగ్ సేవలు, ఐజీసీ భవనాల నిర్వహణ, మరమ్మతులు కోసం వేర్వేరుగా ఏపీసీఆర్డీఏ ప్రభుత్వానికి బిల్లులు పంపించింది. హౌస్ కీపింగ్ సేవల కోసం 7 కోట్ల 13 లక్షలు, సాంకేతిక సేవల కోసం 2 కోట్ల 13 లక్షలు, ఐజీసీ భవనాల నిర్వహణ, పార్కుల అభివృద్ధి, ఫర్నిచర్ తదితర అంశాలకు మరో 7 కోట్ల 67 లక్షలు ఖర్చు చేసినట్లు ఏఎంఆర్డీఏ ప్రభుత్వానికి బిల్లులు పంపింది. మొత్తం 16.94 కోట్లు ఎఎంఆర్డీఏ( ఏపీసీఆర్డీఏ) ఖాతాకు చెల్లింపులు చేసేందుకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
సచివాలయంలో హౌస్ కీపింగ్ సేవలకు నిధులు మంజూరు - సచివాలయంలో హౌస్ కీపింగ్ సేవలు
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకీ చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో హౌస్ కీపింగ్ సేవలు సహా మరమ్మతులు, పార్కు అభివృద్ధి తదితర సేవలకు చెల్లింపులు చేసేందుకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.
హౌస్ కీపింగ్ సేవలకు నిధులు మంజూరు