కరోనా దృష్ట్యా బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1.47 కోట్ల తెల్లకార్డుదారులకు.. 2 నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. 88 లక్షల మందికి ఉచిత బియ్యం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. కేంద్రం ద్వారా లబ్ధి అందని 59 లక్షల కార్డుదారులకు.. ఉచితంగా బియ్యం ఇవ్వనున్నారు. రేషన్ వాహనాల ద్వారా.. ప్రతి లబ్ధిదారుడికి మేలో 10 కిలోలు, జూన్‌లో 10కిలోల చొప్పున పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. నెలకు రెండు సార్లు కాకుండా ఒకేసారి డబుల్ కోటా ఇవ్వాలని సూచించారు. బియ్యం పంపిణీకి రూ.764 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీపీఎల్ కుటుంబాలకు ఉచిత బియ్యం - ఉచిత రేషన్ వార్తలు
కరోనా విపత్కర పరిస్థితుల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
బీపీఎల్ కుటుంబాలకు ఉచిత బియ్యం