ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో విలేకరులకు కరోనా ఉచిత వ్యాక్సినేషన్ - విలేకరులకు విజయవాడలో ఉచిత కొవిడ్ టీకా పంపిణీ

విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్​లో నేటి నుంచి ప్రతిరోజూ 15 మంది విలేకరులకు కరోనా టీకా పంపిణీ జరుగుతోంది. ఆసక్తి కలిగిన జర్నలిస్టు​లు.. ప్రెస్​ క్లబ్​లో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. 45 నుంచి 59 ఏళ్లలోపు వారికి వైద్యుల నుంచి ధ్రువపత్రం తప్పనిసరని ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ పీవీ రమణమూర్తి తెలిపారు.

free covid vaccination to journalists in vijayawada andhra hospitals
విలేకరులకు విజయవాడలో ఉచిత కరోనా వ్యాక్సినేషన్

By

Published : Mar 16, 2021, 5:52 PM IST

విలేకరులకు విజయవాడలో కొవిడ్ వాక్సినేషన్ ప్రారంభించారు. లయన్ పుట్టగుంట వెంకట సతీష్ హెల్త్ ఫౌండేషన్, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో.. నగరంలోని ఆంధ్రా హాస్పిటల్స్​లో ఉచితంగా టీకా పంపిణీ నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి గంటపాటు.. ప్రతిరోజూ 15 మందికి చొప్పున వాక్సినేషన్ కార్డులు ప్రెస్ క్లబ్‌లో ఇస్తామని ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ పీవీ రమణమూర్తి తెలిపారు. ఆసక్తి కలిగిన జర్నలిస్టులు.. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

45 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న విలేకరులు.. తమకు తెలిసిన వైద్యుని నుంచి ఫిట్ ఫర్ వాక్సినేషన్ ధ్రువపత్రం తప్పకుండా తీసుకురావాలని రమణమూర్తి తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారికి ఆ అవసరం లేదన్నారు. ప్రెస్ క్లబ్‌లో పేరు నమోదు చేసుకుని.. టీకా పొందే అవకాశం వినియోగించుకోవాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details