Free books distribution: ప్రజలలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలనే ఆలోచనతో.. విజయవాడలోని రామమోహన్ గ్రంథాలయ నిర్వాహకులు పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. 20వ తేదీ వరకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సాంకేతికత పెరుగుతున్న తరుణంలో.. ప్రతి ఒక్కరూ ఫోన్లతోనే కాలం గడుపుతున్నారని, ఇటువంటి పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని గ్రంథాలయ అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. పుస్తకాల వితరణ జరుగుతుండటంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి తమకు అవసరమైన పుస్తకాలను తీసుకెళ్తున్నారని చెప్పారు.
Free books distribution ఉచితంగా పుస్తకాల పంపిణీ - రామమోహన్ గ్రాంథాలయ ఉచిత పుస్తకాల పంపిణీ
Free books distribution: విజయవాడలోని రామమోహన్ గ్రంథాలయ నిర్వాహకులు పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు. పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉచితంగా పుస్తకాలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నేటినుంచి 20వ తేదీ వరకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వనున్నారు.
పుస్తకాల పంపిణీ