రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి 12వ తేదీ వరకూ.... ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదింటి మధ్య నామపత్రాలను స్వీకరిస్తారు. ఈ దశ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాలకొండతోపాటు విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరిలో అమలాపురం, పశ్చిమ గోదావరిలో ఏలూరు రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో నూజివీడు, ప్రకాశంలో మార్కాపురం, నెల్లూరు, కర్నూలులో ఆదోని, అనంతపురంలో పెనుకొండ, కడప జిల్లాలో జమ్మలమడుగు, కడప..... చిత్తూరు జిల్లాలో తిరుపతి రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు జరగనున్నాయి.
నేటి నుంచి నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు - fourth phase panchayat elections nominations
నేచి నుంచి నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 12న తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న పోలింగ్ జరుగునుంది.
![నేటి నుంచి నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు fourth phase elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10564832-820-10564832-1612907145864.jpg)
నేటి నుంచే నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
16వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువు ఉండగా.... 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం మండలాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఇదీ చదవండి
వాలంటీర్లది ఉద్యోగం కాదు..స్వచ్ఛంద సేవ: సీఎం జగన్
Last Updated : Feb 10, 2021, 8:37 AM IST