కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం గుడివాకవారిపాలెం గ్రామంలో గుడివాక రాజారావు అనే వ్యక్తి ఇంటి ముందు నాలుగు కుక్కలు తెల్ల త్రాచుపామును గుర్తించాయి. వెంటనే అవి ఆ సర్పంపై దాడి చేశాయి. పాము బుసలు కొడుతూ గ్రామ సింహాలను బెదిరించాలని చూసినప్పటికీ...అవి అదరు, బెదురు లేకుండా పోరాడాయి. చివరికి అలసిన సర్పం.. కుక్కల దాడిలో మరణించింది. ఇదంతా గమనించిన ఇంటి యజమాని ఈ దృశ్యాన్ని చరవాణిలో బంధించి అంతర్జాలంలో ఉంచగా...ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
పాము-కుక్కల ఫైట్.. దాడిలో మరణించిన సర్పం
నాలుగు గ్రామ సింహాల దాడిలో ఓ సర్పం ప్రాణం విడిచింది. వనంలో ఉండాల్సిన పాము జనాల మధ్యకు చేరిందని కోపగించిన కుక్కలు దానిపై దాడికి దిగాయి. పాము-కుక్కల పోరాటంలో అలసిన సర్పం ప్రాణాలు విడిచింది.
కుక్కల దాడిలో మరణించిన త్రాచుపాము