కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అడుగడునా అన్యాయం చేస్తోందని... ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్‌బాబు విజయవాడలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్ సిటిజన్ ఫోరంనిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన... విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులను అటకెక్కించారన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అసాధ్యమని చెప్పి.. పాండిచ్చేరి ఎన్నికల్లో హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించడం దారుణమని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అనేక సంస్థలను నెలకొల్పాల్సిందిపోయి...ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడాన్ని ఫోరమ్ తరపున వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.