ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వాజ్​పేయీ జయంతి

రాష్ట్రవ్యాప్తంగా దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్​పేయీ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

atal-bihari-vajpayees-jayanti-celebrations-were-held-in-ap
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వాజ్​పేయీ జయంతి

By

Published : Dec 25, 2020, 1:54 PM IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్బంగా తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

విజయవాడ సత్యనారాయణపురం ప్రధాన కూడలిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ జయంతిని నిర్వహించారు.‌ ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, భాజపా జాతీయ నేత జీవీఎల్ నర్శింహారావు పాల్గొని అటల్ బిహారీ వాజ్​పేయీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పళ్లు పంపిణీ చేశారు. అటల్ బిహారీ వాజ్​పేయీ దేశాభివృద్ధికి ఆనాడే బాటలు వేశారని... ఇప్పుడు ప్రధాని మోదీ అదే బాటలో పయనిస్తున్నారని జీవీఎల్ నర్శింహారావు పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా మైలవరంలోని స్థానిక భాజపా కార్యాలయంలో వాజ్​పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మైలవరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వత్సవాయి మండలంలో వాజ్​పేయీ జయంతిని భాజపా నేతలు ఘనంగా నిర్వహించారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట దర్గా కూడలిలో వాజ్​పేయీతోపాటు భాజపా రాష్ట్ర కోశాధికారి సత్యమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

అనాగరిక చర్యలతో రాష్ట్రం ఎటు పోతోంది?: తెలుగుదేశం

ABOUT THE AUTHOR

...view details