నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై దాడి ఘటనను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఖండించారు. మాస్కు ధరించాలని సూచించిన దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిపై అధికారిననే అహంకారంతో క్రూరంగా దాడి చేయడం అమానుషమని స్పష్టం చేశారు.
ఇది క్షమించరాని నేరమన్నారు. ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయడానికి పర్యటక శాఖకు 4 రోజులు పట్టిందా అని నిలదీశారు. వైఎస్ జగన్ తెచ్చిన దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.