ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం 10 లక్షల మంది పేదల ఉసురు తీసుకుందని ఆరోపించారు. వివిధ స్థాయిల్లో ఉన్న 2లక్షల 60 వేల ఇళ్లకు ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక పేదవాడి పొట్ట కొట్టి మరొకరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం న్యాయమా అని ఆయన నిలదీశారు. నడకదారులను స్వాధీనం చేసుకుంటే రైతులు వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను వైకాపా ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.
'ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని సీఎం నిర్వీర్యం చేస్తున్నారు' - former minister kalva srinivasulu
పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నిర్వీర్యం చేశారని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఒకరి పొట్ట కొట్టి మరొకరికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు