'గాలి ప్రచారం చేయడంలో.. విజయసాయి రెడ్దిది అందెవేసిన చెయ్యి' - jawahar strong comments on vijayasai reddy
గాలి ప్రచారం చేయడంలో విజయసాయి రెడ్దిది అందెవేసిన చెయ్యని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. ఎవరి ప్రమేయంతో వ్యాక్సిన్‌పై ట్వీట్ చేసి.. మళ్లీ తొలగించారని నిలదీశారు.
!['గాలి ప్రచారం చేయడంలో.. విజయసాయి రెడ్దిది అందెవేసిన చెయ్యి' former minister jawahar fire on vijayasai reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9901504-789-9901504-1608126069697.jpg)
గాలిప్రచారం చేయడంలో విజయసాయి రెడ్దిది అందవేసిన చెయ్యి
ప్రజల్ని మోసగించేందుకు విజయసాయి రెడ్ది పేటెంట్ హక్కులు తీసుకుని ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. వ్యాక్సిన్ విషయంలోనూ బ్రోకరేజ్ చేసి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి అసత్య ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని.. ఎవరి ప్రమేయంతో వ్యాక్సిన్‌పై ట్వీట్ చేసి మళ్లీ తొలగించారని ప్రశ్నించారు. ప్రపంచంలోనే కరోనాకు వ్యాక్సిన్ ఉందో లేదోననే అనుమానంలో ప్రజలుంటే.. ఈ రకమైన గాలిప్రచారంతో ప్రజలను మోసగించొద్దన్నారు.