పరిపాలన అంటే సీఎం జగన్ ఫ్యాక్షనిజం అనుకుంటున్నారని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలను కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలన్న ఆలోచించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా జగన్ తీరు ఉందని విమర్శించారు. ప్రపంచమంతా కరోనాకు భయపడుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్‌ను మార్చే ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని జవహర్ ప్రశ్నించారు. కరోనా తీవ్రతను పక్కన పెట్టి రమేష్ కుమార్ పై పగ తీర్చుకొని జగన్ తన అహం చల్లార్చుకున్నారని మండిపడ్డారు.
'పగ తీర్చుకొని జగన్ అహం చల్లార్చుకున్నారు' - మాజీమంత్రి జవహర్
ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న వేళ... ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్‌ను మార్చే ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏముందని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు.
!['పగ తీర్చుకొని జగన్ అహం చల్లార్చుకున్నారు' former minister jawahar comments on jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6747905-453-6747905-1586588048006.jpg)
మాజీ మంత్రి జవహర్