ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Eatala Rajender: భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్‌ - జేపీ నడ్డా తాజా వార్తలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరారు. ఈటలతోపాటు పలువురు నేతలూ కమలం కండువా కప్పుకొన్నారు.

భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్‌
భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్‌

By

Published : Jun 14, 2021, 12:57 PM IST

భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్‌

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్(Former minister Eatala Rajender) కమలం గూటికి (Joined in BJP) చేరారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్, ఆర్టీసీ కార్మిక సంఘం మాజీ నేత అశ్వత్థామరెడ్డి కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(union minister dharmendra pradhan), రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌(tarun chugh).. ఈటల బృందాన్ని భాజపాలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈటల సహా అతని అనుచరులకు పార్టీ సభ్యత్వం అందజేశారు.

ఈటలది కీలక పాత్ర

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వంలో ఈటల కీలకపాత్ర పోషించారని.. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారని ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. కర్ణాటక తర్వాత సత్తా చాటే అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ(telangana state) అని.. ఈటల వంటి నేతల చేరికతో రాష్ట్రంలో భాజపా(BJP) బలపడుతందున్నారు. అనేక మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. కొవిడ్(Covid-19) కారణంగా కొద్దిమందితోనే ఈటల పార్టీలో చేరారని వివరించారు.

భాజపాయే అధికారంలోకి..!

రాబోయే కాలంలో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ఉందని ఈటల రాజేందర్(Eatala Rajender)​ పేర్కొన్నారు. తెలంగాణలో భాజపా విస్తరణకు కృషి చేస్తామని వెల్లడించారు. భాజపా ఆశలు నెరవేర్చేలా మావంతు కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:jagan bail cancel petition: వేధింపులే జగన్​ కండబలం ప్రదర్శిస్తున్నారనేందుకు నిదర్శనం: రఘురామ

ABOUT THE AUTHOR

...view details