గండికోట నిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ అసమర్థత వల్లే గుర్నాథరెడ్డి హత్య జరిగిందని మాజీమంత్రి దేవినేని ఉమా విమర్శించారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లి అన్యాయాన్ని ప్రశ్నించినందుకే గుర్నాథరెడ్డి హత్య జరిగిందని ఉమా ఆరోపించారు.ఈ హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ అసమర్థత వల్లే గుర్నాథరెడ్డి హత్య: దేవినేని ఉమా - సీఎం జగన్ అసమర్థత వల్లే గుర్నాథరెడ్డి హత్య జరిగింది: దేవినేని ఉమా
సీఎం జగన్ ఎన్ని కుట్రలు పన్నినా అమరావతి ఉద్యమం ఆగదని మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. జగన్ అసమర్థత వల్లే గుర్నాథరెడ్డి హత్య జరిగిందని ఆయన విమర్శించారు.
![సీఎం జగన్ అసమర్థత వల్లే గుర్నాథరెడ్డి హత్య: దేవినేని ఉమా former minister devineni uma comments on cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9564429-766-9564429-1605551170948.jpg)
సీఎం జగన్ అసమర్థత వల్లే గుర్నాథరెడ్డి హత్య జరిగింది: దేవినేని ఉమా
జగన్ ఎన్ని కుట్రలు పన్నినా అమరావతి ఉద్యమం ముందుకు వెళ్తోందన్నారు. వేలాది మంది పోలీసుల మధ్య సచివాలయానికి వెళ్లడానికి సీఎం సిగ్గుపడాలన్నారు. రూ.198 కోట్ల ధాన్యం డబ్బులు పెండింగ్లో ఉన్నా.. బూతుల మంత్రి మాత్రం జగన్ను సంతోషపర్చడానికే తన సమయాన్ని వెచ్చిస్తున్నారని ఉమా మండిపడ్డారు. గుడివాడలో పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వకుండా, వాటికి మౌలిక సౌకర్యాలు కల్పించకుండా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: