ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మడ అడవుల నరికివేత ఆపేయాలి: చినరాజప్ప - Former minister Chinarajappa

ఇళ్ల స్థలాల కోసం కాకినాడ మడ అడవుల నరికివేతను వైకాపా ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని మాజీమంత్రి చినరాజప్ప డిమాండ్‌ చేశారు.

Former minister Chinarajappa demanded the immediate withdrawal of the ycp  government for the destruction of the Kakinada mangroves for homelessness.
మాజీమంత్రి చినరాజప్ప

By

Published : Apr 27, 2020, 7:14 AM IST

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ.... ప్రభుత్వం కాకినాడ మడ అడవులను నరికి లేఅవుట్లు వేయిస్తోందంటూ....తెలుగుదేశం నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల కోసం.... అడవుల నరికివేత తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల నుంచి కాకినాడను రక్షిస్తున్న మడ అడవులను... నాశనం చేస్తున్నారని విమర్శించారు. మడ అడవులను నమ్ముకుని జీవిస్తున్న 90 వేలమంది మత్స్యకారుల భవిష్యత్తును.... ప్రశ్నార్థకం చేయొద్దన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తమ ప్రభుత్వం సమర్థంగా పని చేస్తే.... ఇళ్ల స్థలాల కోసం వైకాపా సర్కార్ ప్రకృతిని నాశనం చేస్తోందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details