ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు అకాడమీని యథావిధిగా కొనసాగించాలి: మండలి బుద్ధప్రసాద్‌ - తెలుగు అకాడమీ

సీఎం జగన్‌కు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరు మార్పును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. అకాడమీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Mandali Buddha prasad letter to CM Jagan
సీఎం జగన్‌కు మండలి బుద్ధప్రసాద్‌ లేఖ

By

Published : Jul 15, 2021, 7:40 PM IST

తెలుగు అకాడమీ పేరు మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ డిమాండ్ చేశారు. అకాడమీని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

అకాడమీ పేరు మార్పును పార్టీలు వ్యతిరేకించాయని.. సామాజిక మాధ్యమాల్లోనూ పెద్దఎత్తున నిరసనలు వెలువెత్తుతున్నాయని బుద్ధ ప్రసాద్ చెప్పారు. అకాడమీకి రావాల్సిన రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలని.. అలాగే సంస్కృత అకాడమీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details