అటవీ శాఖలో 2004లో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులకు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై.. వారంతా ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు లేవంటూ సచివాలయం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు.
కనీస అవసరాలు తీరనంతగా.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. తమతో పాటు ఉద్యోగాలు పొందిన తెలంగాణ రాష్ట్ర సిబ్బందికి.. పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ, ఒడిశా తరహాలో ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.