Foreign Cigarettes Seized: అక్రమంగా సరఫరా చేస్తున్న రూ.3.5 కోట్ల విలువైన విదేశీ బ్రాండ్ల సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌లోని పాట్నా నుంచి విజయవాడకు సిగరెట్లు రవాణా జరుగుతున్నట్లు గుర్తించామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కీసరపల్లి జాతీయ రహదారి వద్ద సిగరెట్ల ట్రక్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ట్రక్‌లో రెండు రకాల బ్రాండ్ల సిగరెట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్యారిస్ బ్రాండ్ 264 కాటన్లు, గోల్డ్ విమల్ 136 కాటన్లు ఉన్నట్లు అధికారలు తెలిపారు. సిగరెట్ పెట్టెలపై తయారీదారు వివరాలు, సిగరెట్లకు సంబంధించిన రశీదులు లేవని తెలిపారు. వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Cigarettes Seized: రూ.3.5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్ - విజయవాడలో విదేశీ సిగరెట్లు సీజ్
Cigarettes Seized: అక్రమంగా సరఫరా చేస్తున్న విదేశీ బ్రాండ్ల సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీసరపల్లి జాతీయరహదారి వద్ద రూ.3.5 కోట్ల విలువైన సిగరెట్లు ఉన్న ట్రక్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
![Cigarettes Seized: రూ.3.5 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు సీజ్ విదేశీ సిగరెట్లు సీజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16005838-954-16005838-1659533204646.jpg)
విదేశీ సిగరెట్లు సీజ్