ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కల్తీ నెయ్యి, మసాలా తయారీ కేంద్రాలపై దాడులు - Krishna district latest news

విజయవాడలోని పలు ప్రాంతాల్లో నెయ్యి, మసాలా, వంటనూనె తయారీ కేంద్రాలపై ఆహార భద్రత అధికారులు దాడులు నిర్వహించారు. కనీస జాగ్రత్తలు పాటించని కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు.

Food safety officials raid at Vijayawada
కల్తీ నెయ్యి, మషాలాల తయారీ కేంద్రాలపై దాడులు

By

Published : Apr 6, 2021, 5:24 PM IST

విజయవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న నెయ్యి, మసాలా, వంటనూనెల తయారీ కేంద్రాలకు ఆహార భద్రత అధికారులు నోటీసులు జారీ చేశారు. నగరంలోని పాత రాజరాజేశ్వరిపేట, ఇందిరా నాయక్ నగర్, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని ఈ తయారీ కేంద్రాలపై ఆహార భద్రత, రెవెన్యూ, విజిలెన్స్ అధికారుల బృదం మెరుపు దాడులు చేశారు.

ఫుడ్ సేప్టీ ప్రమాణాలు పాటించని తయారీ దారులకు నోటీసులు ఇచ్చారు. వాటిల్లో నందిని ఫుడ్ ప్రొడక్ట్స్, వెంకటేశ్వర ఆయిల్ ట్రేడర్స్, భారతి గీ ట్రేడర్స్, లక్ష్మీ సాయి ఆయిల్ ట్రేడర్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తయారీదారులను ఆహార భద్రత శాఖ ప్రాంతీయ అధికారి పూర్ణ చంద్రరావు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details