ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపత్కాలంలో ఆపన్న హస్తాలు - lock down latest news in telugu

కరోనా వైరస్ విస్తరిస్తున్న​ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉదారత చాటుకుంటున్నాయి.

ఆపత్కాలంలో ఆపన్న హస్తాలు
ఆపత్కాలంలో ఆపన్న హస్తాలు

By

Published : Apr 7, 2020, 4:17 PM IST

రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి పలువురు దాతలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయానికి ముందుకొచ్చాయి.

300 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉపాధి కోల్పోయిన 300 మంది నిరుపేదలకు 'సంకల్ప నేటి గాంధీ సొసైటీ' ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు కనులు రామ్మూర్తి, కళింగ వైశ్య యూత్ సభ్యుల ఆధ్వర్యంలో రాజాం సీఐ సోమశేఖర్ చేతుల మీదగా నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అండగా

లాక్​డౌన్​ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో 'శ్రీ కృష్ణ దేవరాయ సంక్షేమ సంఘం' సభ్యులు చేయూతనిచ్చారు. సుమారు 500 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.

వెయ్యి మందికి అల్పాహారం పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస 'మెట్టవలస సేవాసమితి' సభ్యలు కరోనా నేపథ్యంలో తమవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్​ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, పేదలకు సేవాసమితి ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అల్పాహారం అందించారు.

కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదలకు తూర్పు గోదావరి జిల్లా తుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రూ.500 విలువైన కిట్లను సుమారు 300 మందికి అందించారు. ఈ సందర్భంగా కన్యకపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఉదారత చాటుకున్న స్వచ్ఛంద సంస్థ

పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామంలో 'అల్లూరి సీతారామరాజు సేవాసమితి' ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సేవా సమితి నిర్వాహకుడు పేకేరు శీను రూ.12 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను గ్రామంలోని 1600 కుటుంబాలకు అందజేశారు. వాటితో పాటు అరకిలో పచ్చి రొయ్యల ప్యాకెట్లను పంపిణీ చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు..

లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలకు కృష్ణా జిల్లా తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లాలోని ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం శివారు కోమటికుంటలో ఒక్కో కుటుంబానికి ఐదు కిలోల బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లను అందజేశారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

110 కుటుంబాలకు చేయూత

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వెంగళాపురం, మంగళంపాడు, ఆత్రేయపురం గిరిజన ప్రాంతాల్లోని వాసులకు నిత్యావసర వస్తువులను యూటీఎఫ్ నాయకులు అందించారు. 110 కుటుంబాలకు రూ.500 విలువ చేసే సరుకులను పంపిణీ చేశారు.

కూరగాయలు పంపిణీ చేసిన ఎస్ఐ

కరోనా నేపథ్యంలో పనులు లేక కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో కూలీలు బుట్టలు అల్లుతూ ఇంటికే పరిమితమ్యారు. వారికి సహాయం చేసేందుకు స్థానిక ఎస్ఐ​ శివనారాయణ కూరగాయలను పంపిణీ చేశారు. గ్రామాల్లో తిరుగుతూ లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి:

నిరుపేదలకు కూరగాయల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details