హైదరాబాద్‌లో ఇంకా వరద ముంపులోనే పలు కాలనీలు కొట్టుమిట్టాడుతున్నాయి. వరద తాకిడికి మీర్‌పేట్‌లోని మిథిలానగర్‌లో ఓ ఇల్లు జలపాతాన్ని తలపిస్తోంది. వెనక భాగం నుంచి వస్తున్న నీళ్లు... ఇంట్లో కెళ్లి బయటకు పొంగి పొర్లుతోంది. ఇంట్లో నడుములోతు నీళ్లు చేరడంతో... బియ్యం, సరుకులు, సామగ్రి, పిల్లల పుస్తకాలు తడిసిపోయాయి. మరికొన్ని వస్తువులు బయటికి కొట్టుకుపోయాయి. ముంపు భయంతో సొంతింటిని వదిలి వెళ్లాల్సి వస్తోందంటూ బాధితులు కంటతడిపెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.'
తెలంగాణ: మీర్‌పేట్‌లో జలపాతాన్ని తలపిస్తున్న ఓ ఇల్లు - Floods in Hyderabad
హైదరాబాద్‌లో ఇప్పటికీ జలదిగ్బంధంలోనే పలు ప్రాంతాలు ఉన్నాయి. వరద తాకిడికి మీర్‌పేట్‌లో ఓ ఇల్లు జలపాతాన్ని తలపిస్తోంది. ఇంట్లో వెనక భాగం నుంచి భారీగా వరద వస్తోంది.
జలదిగ్భంధంలోనే హైదరాబాద్