విజయవాడలో భారీ వర్షం(heavy rain in vijayawada) కరిసింది. వాతావరణంలోని మార్పులతో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రధాన రహదారుల్లో నీరు(flood on roads) నిలిచింది. ఫలితంగా వాహనదారులు అవస్థలు పడ్డారు. బెంజ్ సర్కిల్, బందర్ రోడ్డు, ఆటోనగర్, మొఘల్రాజపురం, సింగ్ నగర్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. బాడవపేట గంగానమ్మ వీధిలో ఒక రేకుల ఇల్లు నేలమట్టం(house collapse) అయ్యింది. ఇంట్లో ఉన్న ఒకరికి ప్రాణాపాయం తప్పి, స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు రోడ్, విజయ టాకీస్ సెంటర్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
RAIN: విజయవాడలో భారీ వర్షం.. రహదారులపై నిలిచిన నీరు
విజయవాడ నగరంలో(rain in vijayawada) ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. ఫలితంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు(problems with rain). బాడవుపేట గంగానమ్మ వీధిలో ఓ రేకుల ఇల్లు నేలమట్టమైంది.
విజయవాడలో భారీ వర్షం