గోదావరి వరద ప్రభావిత జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. మొత్తం 4,150 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వరద నీటి ప్రభావం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు లెక్కించారు. వరద ప్రభావిత ఆరు జిల్లాల్లో ఇప్పటి వరకు 7,842 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆరు జిల్లాల్లో 14,650 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 1,100 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని అంచనా.
వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా ఆస్తి, పంట నష్టం ! - వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా నష్టం
గోదావరి వరద ప్రభావిత జిల్లాల్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. నష్టం అంచనాలను ప్రాథమికంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ధిక సాయం కోసం విజ్ఞప్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా ఆస్తి
పెద్ద ఎత్తున వచ్చిన వరద కారణంగా కచ్ఛా, పక్కా ఇళ్లు , విద్యుత్ స్థంభాలు ఇతర ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వరద తగ్గుముఖం పట్టాక నష్టం అంచనా కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చారు. నష్టం అంచనాలను ప్రాథమికంగా అంచనా వేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ధిక సాయం కోసం విజ్ఞప్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
ఇవీ చూడండి