ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Warehousing, Oilfed Company: వేర్‌హౌసింగ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థల్లో రూ.14.50 కోట్ల ఎఫ్‌డీలు మాయం - ఏపీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణం

తెలుగు అకాడమీతో మొదలైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణం.. రాష్ట్రంలోని మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకూ పాకింది. రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్​కు చెందిన ఖాతా నుంచి రూ.9.50 కోట్లు, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ఖాతా నుంచి రూ.5 కోట్లు మాయమైనట్లు అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడింది.

fixed deposits are missing from Warehousing, Oilfed Company in ap
వేర్‌హౌసింగ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థల్లో రూ.14.50 కోట్ల ఎఫ్‌డీలు మాయం

By

Published : Oct 13, 2021, 8:17 AM IST

తెలుగు అకాడమీ(telugu academy)తో మొదలైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణం(fixed deposit scam) ఏపీలోని మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకూ పాకింది. రాష్ట్ర గోదాముల సంస్థ (వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌)(warehousing corporation)కు చెందిన ఖాతా నుంచి రూ.9.50 కోట్లు, ఏపీ సహకార నూనెగింజల సమాఖ్య (ఏపీ ఆయిల్‌ఫెడ్‌)(oilfed) ఖాతా నుంచి రూ.5 కోట్లు మాయమైనట్లు అధికారుల ప్రాథమిక విచారణలో బయటపడింది. రాష్ట్రంలో ఇంకా ఎన్ని సంస్థలకు చెందిన ఎఫ్‌డీ సొమ్ములు పక్కదారి పట్టాయో తేలాల్సి ఉంది.

వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఆయిల్‌ఫెడ్‌లలో సొమ్ము గోల్‌మాల్‌పై హైదరాబాద్‌ సీసీఎస్‌(hyderabad cps police) పోలీసులు ఏపీ ప్రభుత్వానికి(ap government) సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేయగా.. వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ రూ.34 కోట్ల మొత్తాన్ని వివిధ బ్యాంకుల్లో 34 ఎఫ్‌డీలుగా పెట్టినట్లు తేలింది. భవానీపురంలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులో తొమ్మిది ఎఫ్‌డీల కింద రూ.9.50 కోట్లు పెట్టారు. ఇందులో రూ.12.50 లక్షలు మాత్రమే ఉంచి మిగిలిన సొమ్మంతా తరలించేశారు. సంబంధిత సంస్థకు చెందిన ఒక అధికారి.. ఉన్నతాధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేసి గోదాముల సంస్థ పేరుతో మరో ఖాతా సృష్టించి అందులోకి బదిలీ చేసినట్లు గుర్తించారు. అక్కడినుంచి తమకు కావాల్సిన వారికి చేర్చారు. మరో 2నెలల్లో ఈ ఎఫ్‌డీ గడువు తీరనుంది. అయితే గల్లంతైన ఎఫ్‌డీకి సంబంధించిన మొత్తాన్ని వడ్డీతో సహా ఇవ్వడానికి బ్యాంకు అధికారులు అంగీకరించారని వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ శ్రీకంఠనాథరెడ్డి చెప్పారు. ఏపీ ఆయిల్‌ఫెడ్‌ సంస్థ తమ డిపాజిట్లను పరిశీలించగా.. వీరపనాయునిగూడెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.5 కోట్ల ఎఫ్‌డీ మాయమైనట్లు తేలింది. ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై విచారిస్తున్నామని మార్కెటింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

మరెన్ని సంస్థల్లో గల్లంతయ్యాయో?

గోదాముల సంస్థ, ఆయిల్‌ఫెడ్‌లలో ఎఫ్‌డీల గోల్‌మాల్‌ వెలుగులోకి రావడంతో.. అన్ని శాఖల పరిధిలోని సంస్థల్లో ఎఫ్‌డీలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ సంస్థలు సాధారణంగా తమ వద్దనున్న నిధులను ఏడాది కాలానికి ఎఫ్‌డీ చేస్తుంటాయి. అంతకు తక్కువ కాలానికి చేస్తే వడ్డీ తక్కువగా వస్తుంది. ఇదే అదనుగా కొందరు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వీటిని తమకు కావాల్సిన వాళ్ల పేరుతో బదిలీ చేసి ఏడాది తర్వాత తెచ్చి కడుతుంటారు. గతంలోనే ఇలాంటి సంఘటనలు బయటపడ్డాయి. తాజాగా అసలు సొమ్ముకే ఎసరు పెట్టడంతో గుట్టురట్టయింది.

ఇదీ చదవండి:APPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త...4 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ABOUT THE AUTHOR

...view details