కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి శివారు రామకృష్ణాపురానికి చెందిన దేవరపల్లి జమలయ్య, శ్రీనివాసరావులు అన్నదమ్ములు. కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. శనివారం జమలయ్య కుమార్తెకు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. శుభకార్యానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లికూతురు మేజర్ కాదంటూ.. ఐసీడీఎస్ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో నిశ్చితార్థాన్ని ఆపారు.
ATTACK: ఆగిన నిశ్చితార్థం.. కుటంబసభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ - krishna district crime
కృష్ణా జిల్లా గన్నవరం సినిమా హాల్ కూడలిలో కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ కలకలం రేపింది. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం రక్తపాతం వరకూ వెళ్లింది. ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
శ్రీనివాసరావు సమాచారం ఇచ్చాడని భావించిన జమలయ్య కుటుంబసభ్యులు.. శ్రీనివాసరావు ఇంటి వద్ద ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు ఇరువర్గాలను చెదరకొట్టారు. అనంతరం స్వగ్రామాలకు బయలుదేరారు. ఈ క్రమంలో జమలయ్య బంధువర్గాన్ని శ్రీనివాసరావు బంధువర్గం గన్నవరం బస్టాండ్ సమీపంలోకి రాగానే వెంబడించి దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడిపై సమాచారం అందుకున్న సీఐ శివాజీ, ఎస్సై రమేష్‌లు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీచదవండి.