ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో జీవనోపాధి లేకనే గుజరాత్ బాట పట్టాం' - ap fishermens happy on released from jail

రాష్ట్రంలో జీవనోపాధి లేకపోవటం వల్లే తాము రాష్ట్రం విడిచి గుజారాత్ బాట పట్టాల్సి వచ్చిందని... పాక్ నుంచి విడుదలైన మత్స్యకారులు తెలిపారు. రాష్ట్రంలో తగిన జెట్టీలు, హార్బర్లు నిర్మిస్తే ఇక్కడే ఉండి కుటుంబాన్ని పోషించుకుంటామన్నారు. పాక్​ చెర నుంచి విడుదల కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

fishermens_released from pakistan
'రాష్ట్రంలో జీవనోపాధి లేకనే గుజరాత్ బాట పట్టాం'

By

Published : Jan 8, 2020, 7:51 PM IST

'రాష్ట్రంలో జీవనోపాధి లేకనే గుజరాత్ బాట పట్టాం'

పాకిస్థాన్​ జైలులో 14 నెలల పాటు నరకయాతన అనుభవించినట్లు అక్కడి నుంచి విడుదలైన రాష్ట్ర మత్స్యకారులు తెలిపారు. తిరిగి సొంత ప్రాంతాలకు వస్తామని అనుకోలేదని... జైలు నుంచి విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో జీవనోపాధిలేక పోవటం వల్లే పొట్ట చేతపట్టుకుని గుజరాత్ వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో తగిన జెట్టీలు, హార్బర్లు నిర్మిస్తే ఇక్కడే ఉండి కుటుంబాన్ని పోషించుకుంటామని...ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నరకయాతన నుంచి విముక్తి పొంది తమవారి వద్దకు వెళ్లడం తమకు చెప్పలేని సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల మరో ఇద్దరు మత్స్యకారులు విడుదల కావాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details