ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: జీవో నెంబర్ 217 రద్దుపై మత్స్యకారుల పోరాటానికి మద్దతు: చంద్రబాబు - కొల్లు రవీంద్ర తాజా వార్తలు

జీవో నెంబర్ 217 రద్దుకు మత్స్యకారుల తరఫున తెదేపా పోరాడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్​లో 13 జిల్లాల మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులు చంద్రబాబును కలిసిన జీవో నెంబరు 217 వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు వివరించారు.

జీవో నెంబర్ 217 రద్దుపై మత్యకారుల పోరాటానికి మద్దతిస్తాం
జీవో నెంబర్ 217 రద్దుపై మత్యకారుల పోరాటానికి మద్దతిస్తాం

By

Published : Sep 3, 2021, 6:42 PM IST

జీవో నెంబర్ 217 రద్దుకు మత్స్యకారుల తరఫున తెదేపా పోరాడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ​భవన్​లో 13 జిల్లాల మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులు చంద్రబాబును కలిసిన జీవో నెంబరు 217 వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు వివరించారు.

ఆన్​లైన్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించి దళారులు, వైకాపా నేతలకు మత్స్య సంపదను దోచిపెట్టేలా జీవో 217 ఉందని పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. రిజర్వాయర్లు, చెరువులు, కాలువల మీద జీవనం సాగిస్తూ..వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్న మత్స్యకార సంఘాల జీవనోపాధికి గండికొట్టేలా ఉత్తర్వులున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది సభ్యులుగా ఉన్న దాదాపు 5 వేల మత్స్యకార సహకార సంఘాల పొట్టగొట్టేలా ఉన్న జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details