పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడనం కారణంగా ఒడిశాలోని దక్షిణ ప్రాంత జిల్లాలు, ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.కోస్తాంధ్ర జిల్లాలపై ఆవరించిన ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ, రేపు చాలా చోట్ల తేలిక పాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.
రాయలసీమలోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరోవైపు.. తీరం వెంబడి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక చేసింది.