ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. చిత్రాన్ని విజయవంతం చేశారంటూ ప్రేక్షకులకు కథనాయకుడు చేతన్ కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో చదువు ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంది అనే అంశానికి హాస్యం జోడించి చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. విజయోత్సవానికి వియవాడ రావటం చాలా సంతోషంగా ఉందని కథనాయిక కాశీష్ వోహ్రా ఆనందం వ్యక్తం చేశారు. చిన్న సినిమాకు పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటామని వ్యాఖ్యనించారు.
విజయవాడలో 'ఫస్ట్ ర్యాంక్ రాజు'.. సందడి - Vijayawada
చదువుల్లో ర్యాంక్ రాకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెరకెక్కించామని చిత్ర కథనాయకుడు చేతన్ చెప్పారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా బృందంతో కలిసి విజయవాడలో పర్యటించారు.
ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్ర బృందం