ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్‌..విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు - ఏపీలో పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహించనున్నారు. మొత్తం 2 వేల736 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 513 సర్పంచి స్థానాలు, 8 వేల748 వార్డు స్థానాల ఏకగ్రీవమైనట్లు వెల్లడించి అధికారులు...మిగిలిన చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో వైపు రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్‌
రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్‌

By

Published : Feb 8, 2021, 5:07 AM IST

Updated : Feb 9, 2021, 12:08 AM IST

మంగళవారం తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 12 జిల్లాల్లో 2వేల736 సర్పంచి స్థానాలకు, 23వేల 754 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనునట్లు పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గానూ 33 వేల193 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి గిరిజాశంకర్ సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని..వెబ్‌కాస్టింగ్‌తో పోలింగ్‌ కేంద్రాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. విశాఖ, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో...పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెనాలి డివిజన్‌లో 118 పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు సిద్ధం చేశారు. సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని శ్రీకాకుళం పోలీసులు తెలిపారు.

రెండో దఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. అదే సమయంలో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో అభ్యర్థులు, పార్టీలు మద్దతుదారులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వైకాపా, తెదేపా మద్దతు దారులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43 వ డివిజన్‌లో …తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర విస్తృతంగా ప్రచారం చేశారు. తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు తాము బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉందంటూ గుంటూరు జిల్లా తాడికొండలో తెదేపా అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.

మూడో దశ పల్లెపోరులో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. రెండోరోజు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.అనంతపురం జిల్లాలో మూడో దశ ఎన్నికలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీగా నామపత్రాలు సమర్పించారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో నూ అభ్యర్థుల నామినేషన్లు వేశారు. విశాఖ మన్యంలో ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ మావోయిస్టులు గోడ పత్రికలు అంటించారు.

ఇదీచదవండి

గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

Last Updated : Feb 9, 2021, 12:08 AM IST

ABOUT THE AUTHOR

...view details