Heart Surgery Success at GGH Vijayawada పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తెలిపారు. విజయవాడలోని జీజీహెచ్‌లో మొదటిసారిగా నిర్వహించిన గుండె ఆపరేషన్ విజయవంతమైంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రప్రథమ గుండె ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న కృపాకర్ అనే వ్యక్తిని వైద్యులు కంటికి రెప్పలా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
GGH Vijayawada: జీజీహెచ్‌లో మొట్టమొదటి గుండె సర్జరీ విజయవంతం - విజయవాడ జీజీహెచ్‌లో మొట్టమొదటి గుండె ఆపరేషన్ విజయవంతం
Heart Surgery at GGH Vijayawada: విజయవాడలోని జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొదటిసారి నిర్వహించిన గుండె ఆపరేషన్ విజయవంతమైంది. పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ తెలిపారు.
విజయవాడ జీజీహెచ్‌లో మొట్టమొదటి గుండె ఆపరేషన్ సక్సెస్
ఆస్పత్రి ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రోత్సాహంతోనే గుండె ఆపరేషన్ నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో కిడ్నీ ఆపరేషన్లు కూడా చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి:నూజివీడులో కొనసాగుతున్న ఉద్రిక్తత...తెదేపా నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అరెస్ట్