విజయవాడ అజిత్ నగర్ పరిధిలోని సుందరయ్య నగర్ కరకట్ట వెంబడి జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. పునాది కోసం సుమారు పది అడుగుల మేర గొయ్యి తీస్తుండగా ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు అందులో ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు మట్టిలోకి పోవడంతో బయటకురాలేని పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన అజిత్ సింగ్ నగర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అతన్ని కాపాడారు. బాధితుడు విజయవాడ గ్రామీణ మండలం అంబాపురానికి చెందిన విజయ్ కుమార్‌గా తోటి కార్మికులు చెప్పారు.
గుంతలో ఇరుక్కుపోయిన కార్మికుడు.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది - విజయవాడ అజిత్ నగర్లో పునాది గోయ్యిలో ఇరుక్కుపోయిన కార్మికుడు
భవన నిర్మాణ పనుల్లో భాగంగా పునాది తీస్తున్న క్రమంలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అజిత్ సింగ్ నగర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది.. అతన్ని రక్షించారు. బాధితుడు అంబాపురానికి చెందిన విజయ్ కుమార్‌గా గుర్తించారు.
గుంటలో ఇరుక్కుపోయిన కార్మికుడు