విజయవాడ వన్ టౌన్ హామీమ్‌వీధిలో కార్పొరేషన్ వాహనం తగులబడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా హామీమ్ వీధిలో దోమల మందు పిచికారి చేస్తున్న వాహనం మిషన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనం నుంచి డ్రైవరు కిందకు దూకేశాడు. ఆటోలో 30 లీటర్ల డీజిల్ డబ్బా అదనంగా ఉండటంతో డీజిల్ డబ్బా మంటల్లో కాలిపోయింది. మందు పిచికారి యంత్రం దగ్ధమైంది.
దోమల మందు పిచికారి వాహనంలో అగ్ని ప్రమాదం - విజయవాడలో దోమల మందు పిచికారి వాహనం దగ్ధం
విజయవాడ వన్ టౌన్ హామీమ్‌వీధిలో కార్పొరేషన్ దోమల మందు పిచికారి వాహనంలో మంటలు చెలరోగాయి. ఆటో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
విజయవాడలో దోమల మందు పిచికారి వాహనం దగ్ధం
TAGGED:
విజయవాడలో అగ్ని ప్రమాదం